Wednesday, December 13, 2006

సిరివెన్నెల కలం నించి జాలువారిన ఆణిముత్యం.....

జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది

కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తు నాతో నేనే రమిస్తూ
ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కథల్ని మాటల్ని పాటల్నిరంగుల్నీ
రంగవల్లులనీ కావ్య కన్యల్ని ఆడ పిల్లలని

జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది

మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల కూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేనే సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ
వంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాన
కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని

జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది

గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి
నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి నా హృదయములో ఇది సినీవాలి

జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది

This song inspired a film. Rather, a film is created for this song.
It is the last song at http://www.dishant.com/album/Chakram.html

Poetry is felt before it is understood.

4 comments:

S said...

:)good one.... but.. prati line 2 times raayadam anta effective gaa ledu. it is good for recitation...not for reading.

Myriad Enigmas said...

naakkoda anipinchindi. will change it soon.

రానారె said...

ఈ పాటెంత లోతైనదో గురువుగారి మాటల్లోనే వినొచ్చు.

kiraN said...

నాకు బాగా ఇష్టమైన పాట ఇది.